కరోనా క్రైసిస్ ఛారిటీ.. ముందుకొస్తున్న హీరోలు

Published on Mar 29, 2020 5:00 pm IST

ఇండస్ట్రీ లాక్ డౌన్ కారణంగా రోజువారీ వేతనాలతో బ్రతికే కార్మికుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. వీరికి సహాయం చేయడం కోసం సినీ పెద్దలు కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో పెద్ద ఎత్తున ఫండ్ సేకరిస్తున్నారు. చిరంజీవి లాంటి స్టార్ హీరో ముందుగా ఇనిషియేటివ్ తీసుకోవడంతో మిగతా హీరోలు కూడా ముందుకొస్తున్నారు. ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెద్ద ఎత్తున విరాళం ఇచ్చినవారు సైతం ఈ క్రైసిస్ ఛారిటీ కోసం ఫండ్స్ ఇస్తున్నారు.

మొదటగా చిరంజీవి, నాగర్జున చెరొక కోటి రూపాయలు విరాళం ప్రకటించగా రామ్ చరణ్ రూ.30 లక్షలు, మహేష్ బాబు రూ. 25 లక్షలు, నాగ చైతన్య రూ.25 లక్షలు, దిల్ రాజు రూ.10 లక్షలు, వరుణ్ తేజ్ రూ.20 లక్షలు, విశ్వక్ సేన్ రూ.5 లక్షలు, కార్తికేయ రూ.2 లక్షలు, శర్వానంద్ రూ.15 లక్షలు డోనేట్ చేశారు. ఈ మొత్తాన్ని తిరిగి ఇండస్ట్రీ పనులు మొదలయ్యే వరకు కార్మికుల నిత్యావసరాలు తీర్చడం కోసం వినియోగించనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More