జూలై నాటికి టాలీవుడ్ చక్కబడుతుందట

Published on May 25, 2021 10:27 pm IST

కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి ప్రభుత్వం చెప్పకముందే తెలుగు సినీ పరిశ్రమ మూతబడింది. సినిమా హాళ్లు వరం వ్యవధిలోనే పూర్తిగా క్లోజ్ అయ్యాయి. ఆతర్వాత షూటింగ్స్ ఆగిపోవడం మొదలైంది. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలు నిలిచిపోయాయి. హీరోలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కనీసం కొత్త కథలు వినే ఆలోచనలో కూడ లేరు చాలామంది. లాక్ డౌన్ ముగిస్తే చివరి దశలో ఉన్న చిత్రాలను కంప్లీట్ చేసుకోవాలనే తొందరలో ఉన్నారు. మరి ఇండస్ట్రీకి పాత రోజులు ఎప్పుడు వస్తాయి అంటే జూలై నెల మీదే అందరి చూపు ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు వారాలుగా లాక్ డౌన్ నడుస్తోంది. దీంతో కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఇదే తరహాలో ఇంకో రెండు వారలు కఠినమైన లాక్ డౌన్ పాటిస్తే పరిస్థితులు చక్కబడుతాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీన్నిబట్టి జూన్ నెలాఖరుకు లాక్ డౌన్ ముగిసే అవకాశం కనిపిస్తోంది. అంటే జూలై నాటికి షూటింగ్స్ మొదలుకావొచ్చు.

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ ‘అఖండ’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రాలు ఆఖరి దశ షూటింగ్లో ఉన్నాయి. అలాగే ‘ఖిలాడి, శ్యామ్ సింగ రాయ్’ సినిమాలు మధ్య దశలో ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఇంకా నెలన్నర బ్యాలెన్స్ ఉంది. పవన్ యొక్క రెండు సినిమాలు మధ్యలో ఉన్నాయి. ఇవి కాకుండా చాలా సినిమాలు చిత్రీకరణ మధ్యలో ఉన్నాయి. జూలై నెలలో లాక్ డౌన్ సడలింపులు ఇస్తే షూటింగ్స్ మొదలుపెట్టాలని చూస్తున్నారు హీరోలందరూ.

సంబంధిత సమాచారం :