ఫేక్ కలెక్షన్స్ అడ్డుకట్ట వేసేపనిలో నిర్మాతలు

Published on Feb 11, 2020 7:14 pm IST

పెద్ద సినిమా కలెక్షన్స్ విషయంలో ఎప్పటి నుండో ఒక అనారోగ్యకరమైన వాతావరణం నెలకొంది. రికార్డుల కోసం, సినిమాపై హైప్ క్రియేట్ చేయడం కోసం లేని కలెక్షన్స్, రాని వసూళ్లను ఆర్బాటంగా పోస్టర్స్ పై పెద్ద సైజులో ప్రింట్ చేసే బ్లాక్ బస్టర్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ అంటూ విడుదల చేస్తున్నారు. దీని కారణంగా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ లబోదిబో అంటున్నారు. ఒక్కోసారి వారికి కనీసం పెట్టుబడి కూడా వెనక్కిరాని సంధర్భంలో పోస్టర్స్ పై మాత్రం రెట్టింపు లాభాలు చూపెడుతున్నారు. ఈ ట్రిక్స్ కి మొదట్లో ప్రేక్షకులు మోసపోయినా ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు. అదే సమయంలో విషయం లేని సినిమా విడుదల చేసే కోట్లకొలది షేర్ వసూళ్ల పోస్టర్స్ చూసి నవ్వుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ చెత్త సంప్రదాయానికి అడ్డుకట్ట వేసే పనిలో టాలీవుడ్ నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ నిర్మాతల మండలి స్వయంగా ప్రతి సినిమా వసూళ్ల వివరాలను కూలంకషంగా పరిశీలించి, వాస్తవ కలెక్షన్స్ విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి వీరి నిర్ణయం ఎంత వరకు ఫలితాలను ఇస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :