ఆ రాతలకు తెలుగు నిర్మాతలు చెక్ పెట్టనున్నారా..?

ఆ రాతలకు తెలుగు నిర్మాతలు చెక్ పెట్టనున్నారా..?

Published on Aug 10, 2019 6:48 PM IST

సాంకేతిక అభివృద్ధి డిజిటలైజేషన్ ప్రభావం వలన ప్రజల జీవన విధానంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. దానిలో భాగంగా సినీ ప్రేక్షకుల పంధా కూడా మారడం జరిగింది. ఒకప్పుడు సినిమా విడుదలైతే దాని వాస్తవ ఫలితం ఆడియన్స్ ద్వారా మిగతా ప్రేక్షకులకు తెలిసేది. కానీ నేడు అనేక ఆన్లైన్ న్యూస్ వెబ్ సైట్స్ ఒక చిత్ర రిజల్ట్ పై తమకు నచ్చిన రీతిలో రాయడం జరుగుతుంది. సినిమాపై అవగాహన లేని కొందరు ప్రమాణాలు పాటించకుండా,వాస్తవికతకు దూరంగా ఇష్టం వచ్చినట్టు రాస్తున్న రాతలు నిర్మాతలకు నష్టం చేకూర్చుతున్నాయి.

ఈ పరిస్థితికి పరిష్కారం వెతికే పనిలో టాలీవుడ్ బడా నిర్మాతలు పూనుకున్నారని సమాచారం. దిల్ రాజు,అల్లు అరవింద్,స్రవంతి రవి కిషోర్,అశ్విని దత్ వంటి కొందరు బడా నిర్మాతలు నిరాధారంగా చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులపై, మూవీ ఫలితం పై చెడు రాతలు రాసే ఫేక్ సైట్స్ కు చెక్ పెట్టేదిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. ఈ విషయంపై భేటీ కూడా అయిన వీరు,నిర్మాతల మండలి పేర ఒక అధికారిక వెబ్ సైట్ కూడా ప్రారంభించాలని చూస్తున్నారట. మరి వీరి ప్రయత్నం ఎంత మేర విజయం సాధిస్తుందో చుడాలిమరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు