అదే జరిగితే సంచలనమే..!

Published on Apr 1, 2020 8:00 pm IST

కరోనా వైరస్ ప్రభావం ఇప్పట్లో దేశాన్ని వీడే పరిస్థితి కనిపించడం లేదు. లాక్ డౌన్ కి ఇంకా 14 రోజుల సమయం మాత్రమే ఉన్నా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టలేదు. దేశంలో వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతుంది. ఇక సాధారణ పరిస్థితులు ఏర్పడి కొత్త సినిమాల విడుదల ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. పూర్తయిన సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే నిర్మాతలకు చాల నష్టం చేకూరుతుంది. అందుకే టాలీవుడ్ లోని కొందరు నిర్మాతలు ఓ సంచలన నిర్ణయానికి తెరలేపారని వార్తలు వస్తున్నాయి.

సమీప కాలంలో థియేటర్స్ ఓపెన్ అయ్యే సూచనలు కనిపించని నేపథ్యంలో నేరుగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా తమ చిత్రాలు విడుదల చేయాలని అనుకుంటున్నారట. డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ అయిన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, సన్ నెక్స్ట్ వంటి ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ లో నేరుగా సినిమా విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ వి, నిశ్శబ్దం, ఉప్పెన, అరణ్య, 30 రోజుల్లో ప్రేమిచడంఎలా వంటి అనేక సినిమాలు విడుదలకు నోచుకోకుండా అలా పడివున్నాయి. మరి చూడాలి టాలీవుడ్ నిర్మాతలు ఏమి చేస్తారో.

సంబంధిత సమాచారం :

X
More