బాలీవుడ్ మూవీ నిర్మిస్తున్న గ్లిట్టర్స్ ఫిలిమ్స్ అకాడమీ సంస్థ.

Published on Nov 21, 2019 10:59 am IST

టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ గ్లిట్టర్స్ ఫిలిమ్స్ అకాడమీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఖ్వాబ్ సారె జూతే’ పేరుతో తెరకెక్కుతున్న హిందీ చిత్ర నిర్మాణ భాగస్వామిగా మారింది. ఏ జి ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి గ్లిట్టర్స్ ఫిలిమ్స్ అకాడమీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి గ్లిట్టర్స్ ఫిలిమ్స్ అకాడమీ చైర్మన్ దీపక్ బల్దేవ్ దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ కెమెరా మెన్ జవహర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో తుళ్ళిక సింగ్ హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. మధు నారాయణ్ మరో ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తున్నారు. గ్లిట్టర్స్ ఫిలిమ్స్ ఇకపై ప్రతి ఏడాది ఐదు సినిమాలు నిర్మించాలని ప్రణాళికగా పెట్టుకున్నారు. తాను కన్న కలలను సాకారం చేసుకోవడం కోసం ఓ యువతి ఎంచుకున్న మార్గం, చేసిన పోరాటం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న దేశవ్యాప్తంగా ‘ఖ్వాబ్ సారె జూతే’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. త్వరలో మూవీ ఆడియో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More