‘స్వచ్చ హైదరాబాద్’లో టాలీవుడ్ టాప్ స్టార్స్

‘స్వచ్చ హైదరాబాద్’లో టాలీవుడ్ టాప్ స్టార్స్

Published on May 15, 2015 5:00 PM IST

TFI
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన కార్యక్రమం స్వచ్చ భారత్ అభియాన్. ఈ స్వచ్చ భారత్ అభియాన్ ని స్పూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ‘స్వచ్చ హైదరాబాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ స్వచ్చ హైదరాబాద్ ప్రోగ్రాం ద్వారా హైదరాబాద్ ని క్లీన్ గా ఉంచాలని, అలాగే దేశం లోని క్లీన్ మెట్రో సిటీస్ లో మన హైదరాబాద్ ని ఒకటిగా చేయడానికి ఈ ప్రోగ్రాం ని స్టార్ చేయనున్నారు. స్వచ్చ భారత్ కార్యక్రమంలో ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోస్ పాల్గొని పలువురికి స్పూర్తిని ఇచ్చారు. ఇప్పుడు అదే విధంగా స్వచ్చ హైదరాబాద్ లో కూడా టాలీవుడ్ స్టార్స్ పాల్గొననున్నారు.

అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్టార్ హీరోలైన మహేష్ బాబు, నాగార్జున లాంటి వారిని కలిసి వారి సపోర్ట్ కావాలను కోరింది. అంతే కాకుండా టాలీవుడ్ ప్రముఖులైన డి. సురేష్ బాబు, సి. కళ్యాణ్, కోదండరామి రెడ్డి, శివకృష్ణ తదితరులు హోం మరియు సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసి ఈ స్వచ్చ హైదరాబాద్ కి తమ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. ఈ స్వచ్చ హైదరాబాద్ ప్రోగ్రాం ఈ నెల 16 నుంచి 20వ తేదీ లోపు జరగనుంది. ఇలాంటి ఓ మంచి కార్యక్రమం కోసం ముందుకు వస్తున్న టాలీవుడ్ స్టార్స్ అందరికీ హ్యాట్సాఫ్ చెప్పాలి.

తాజా వార్తలు