వైజాగ్, ఉత్తరాంధ్ర హుదూద్ బాధితులను ఆదుకోవడం కోసం టాలీవుడ్ మొత్తం కలిసి చేయనున్న ‘వీ లవ్ వైజాగ్’ వేడుక నవంబర్ 9న జరగనుందనే విషయాన్ని మీకు ఇది వరకే తెలియజేశాం. ఈ వేడుకకి టాలీవుడ్ నుంచి ప్రతి ఒక్క హీరో, డైరెక్టర్, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అందరూ హాజరు కానున్నారు.
ప్రస్తుతం ఈ వేడుక గురించి జరుగుతున్న చర్చల నుంచి తెలిసిన తాజా సమాచారం ఏమిటి అంటే ఈ ప్రోగ్రాం ద్వారా కనీసం 10 కోట్లు అయినా కలెక్ట్ చేసి సిఎం రిలీఫ్ ఫండ్ కి అందిచాలని తెలుగు చిత్ర పరిశ్రమ భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే అంత మనీ వచ్చేలా కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ ని ప్లాన్ చేస్తున్నారు. కావున ‘వీ లవ్ వైజాగ్’ వేడుక కాన్సెప్ట్ టార్గెట్ 10 కోట్లు.
ఈ వేడుక గురించి త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలను మీడియాకు తెలియజేయనున్నారు. ప్రస్తుతం వీ లవ్ వైజాగ్ వేడుకలో 13 గంటల కంటిన్యూ లైవ్ ప్రోగ్రాం గురించి, ఎవరెవరు ఏమేమి చేయాలి అనే చర్చలు జరుగుతున్నాయి.


