యష్, రణ్వీర్ ల సినిమాలు ఉన్నప్పటికీ టాలీవుడ్ యంగ్ హీరో కాన్ఫిడెంట్ విన్నారా!

యష్, రణ్వీర్ ల సినిమాలు ఉన్నప్పటికీ టాలీవుడ్ యంగ్ హీరో కాన్ఫిడెంట్ విన్నారా!

Published on Dec 18, 2025 11:01 PM IST

Toxic-and-Dhurandhar

ఇండియన్ సినిమా దగ్గర ఒకే డేట్ లో పలు భారీ సినిమాలు రావడం కొత్తేమీ కాదు. క్రేజీ క్లాష్ లో వచ్చి సక్సెస్ అయ్యిన సినిమాలూ ఉన్నాయి అలాగే ఫెయిల్ అయ్యిన సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ లిస్ట్ లో వచ్చే ఏడాదికి కూడా పెద్ద లిస్ట్ రెడీగా ఉంది. మరి ఈ లిస్ట్ లో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న అవైటెడ్ సినిమా టాక్సిక్ ఇంకా ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనాలు రేపుతున్న ధురంధర్ కి సీక్వెల్ ఒకే రోజున రాబోతున్నాయి.

ఇదే పెద్ద క్లాష్ అనుకుంటే ఈ సినిమాలతో పాటుగా మన టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన సాలిడ్ యాక్షన్ చిత్రం “డెకాయిట్” కూడా ఉంది. అయితే అలాంటి రెండు భారీ ప్రాజెక్ట్ లు ఉన్నపటికీ ఈ సినిమా క్లాష్ అంటే చాలా మంది అవసరమా అని కూడా ఆలోచించారు. కానీ ఈ క్లాష్ పై అడివి శేష్ కాన్ఫిడెంట్ తో కూడిన కామెంట్స్ వింటే ఆశ్చర్యపోతారు.

డెకాయిట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో క్లాష్ విషయంలో తాను గతంలో మేజర్ సినిమాకి కూడా జరిగింది అని ఒకపక్క కమల్ సర్ విక్రమ్ ఇంకోపక్క సామ్రాట్ పృథ్వీరాజ్ ఉన్నాయి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అని ఒక సముద్రంలో ఎన్నో పెద్ద చేపలు ఉండొచ్చు కానీ గోల్డ్ ఫిష్ మాత్రం మేమే అని తెలిపాడు. దీనితో ఈ సినిమా విషయంలో తాను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అనేది మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ సినిమా ఏ మేరకి విజయాన్ని సాధిస్తుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది మార్చ్ 19 వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు