ప్రత్యేకం : 22 ఏళ్ళ తర్వాత ఒకటవుతున్న తెలుగు చిత్ర పరిశ్రమ.!

ప్రత్యేకం : 22 ఏళ్ళ తర్వాత ఒకటవుతున్న తెలుగు చిత్ర పరిశ్రమ.!

Published on Oct 27, 2014 10:50 AM IST

TFI
మన ఇరు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రకృతి విపత్తు సంభవించినా వారిని ఆదుకోవడంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుటుంది. 22 ఏళ్ళ క్రితం భారీ తుఫాన్ వచ్చి చాలా ప్రాంతాలు దెబ్బతిన్నప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్, ఆర్టిస్టులు అందరూ కలిసి వైజాగ్ లో క్రికెట్ మ్యాచ్ ఆడి తద్వారా వచ్చిన డబ్బును బాధితులకు విరాళంగా ఇచ్చారు. దాదాపు 22 ఏళ్ళ తర్వాత ఇలాంటి అద్భుత ఘట్టానికి మరోసారి తెరలేవనుంది. ఇటీవల వచ్చిన హుదూద్ తుఫాన్ తాకిడే దీనికి కారణం..

మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటై ఒక కార్యక్రమం చేసి తద్వారా వచ్చే మొత్తాన్ని హుదూద్ బాధితులకు అందజేయనున్నారు. ఈ వేడుకకి ఇండస్ట్రీలోని అందరు హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ మరియు ఇండస్ట్రీలోని అందరు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ ఫండ్ రైజ్ కోసం ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి అనేదానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

ఈ తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కలిసి నిర్వహించనున్న ఈ వేడుక గురించిన ప్రత్యేకమైన విశేషాలు ఎప్పటికప్పుడు మీకందజేస్తూనే ఉంటాం. దానికోసం కంటిన్యూ గా 123telugu.com ని విజిట్ చేస్తూ ఉండండి.

తాజా వార్తలు