ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అధికారికమేనా?

Published on Feb 18, 2020 4:45 pm IST

ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ఏ దర్శకుడితో చేస్తున్నాడు అనేదానిపై చాలా రోజులుగా చర్చ నడుస్తుంది. ముగ్గురు, నలుగురు దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా త్రివిక్రమ్ ముందు వరుసలో ఉన్నారు. ఐతే దీనిపై రేపు అధికారిక ప్రకనట రానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎన్టీఆర్ మూవీ పై రేపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కలదు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ దీనిపై స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తుంది.

అల వైకుంఠపురంలో మూవీ విడుదలకు ముందు నుండే ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇక అల బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ ఆయనతో సినిమా ఫైనల్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ అరవింద సమేత వీర రాఘవ మూవీ రావడం జరిగింది. అరవింద సమేత ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఉంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ అంటే ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More