ఈ వారం టాప్ 5 స్ట్రీమ్ అయిన మూవీస్ మరియు వెబ్ సిరీస్ లు ఇవే!

Published on Aug 3, 2021 1:41 pm IST


ఆన్లైన్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించేందుకు పలు ఓటిటి సంస్థలు అత్యుత్తమ కంటెంట్ తో ముందుకు వస్తున్నాయి. అయితే ఈ వారం లో ఎక్కువగా చూసిన టాప్ సినిమా హంగామా 2 అని చెప్పాలి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ చిత్రం ఈ వారం లో మొత్తం 7.6 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అదే విధంగా హాస్టల్ డాజ్ వెబ్ సిరీస్ ఈ వారం ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ సీరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ఈ వారం 4.9 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

కృతి సనన్ హీరోయిన్ గా నటించిన మీమీ చిత్రం 3.6 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొగా, సిటీ ఆఫ్ డ్రీమ్స్ 2 వెబ్ సిరీస్ 3.3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఫర్హాన్ అక్తర్ నటించిన తూఫాన్ చిత్రం 2.2 మిలియన్ వ్యూస్ ను సాధించి ఐదవ స్థానంలో ఉంది. అయితే వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఆన్లైన్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో వీటికి సరికొత్త ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత సమాచారం :