ఎన్టీఆర్ చిత్రానికి మ్యూజిక్ అందివ్వనున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ !
Published on Feb 8, 2017 6:02 pm IST


వరుసగా రెండు భారీ విజయాల్ని దక్కించుకుని స్టార్ రేస్ లో దూసుకుపోతున్న ఎన్టీఆర్ తాజాగా బాబీ డైరెక్షన్లో ఒక చిత్రాన్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తారక్ సోదరుడు కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు కళ్యాణ్ రామ్. అందుకే సినిమాటోగ్రఫర్ సికే మురళీధరన్, హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్వెల్ ను ప్రాజెక్టులోకి తీసుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో ప్రముఖ సంగీత దర్శకుడితో మ్యూజిక్ చేయించనున్నారు.

ఆయనే దేవి శ్రీ ప్రసాద్. గతంలో ఎన్టీఆర్, దేవి శ్రీ కలయికలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ వంటి సినిమాలు మ్యూజికల్ గా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అందుకే ఆ సక్సెస్ ను మరోసారి రిపీట్ చేసేందుకు దేవి శ్రీ చేత మ్యూజిక్ కంపోజ్ చేయిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని కళ్యాణ్ రామ్ స్వయంగా తెలిపారు. ఫిబ్రవరి 15న మొదలుకానున్న ఈ చిత్రంలో ఒక కథానాయికగా రాశి ఖన్నాను ఫైనల్ చేశారు.

 
Like us on Facebook