ప్రవీణ్ సత్తారు సినిమా వెనుక పెద్ద నిర్మాతలు !
Published on Nov 17, 2017 3:01 am IST

‘చందమామ కథలు, గుంటూరు టాకీస్’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు తాజాగా రూపొందించిన ‘పిఎస్వైవ్ గరుడవేగ’ చిత్రం భారీ సక్సెస్ ను అందుకుని ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టడమేగాక హీరో రాజశేఖర్ కు కమ్ బ్యాక్ సినిమాగా నిలిచింది. ప్రస్తుతం సత్తారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను రూపొందించనున్నారు.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్, నటీనటుల ఎంపిక దశలో ఉన్న ఈ సినిమా 2018 మార్చి నుండి మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, అబుండటియా సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇలా పెద్ద నిర్మాతలు ప్రాజెక్ట్ ను టేకప్ చేయడంతో సినిమా గ్రాండ్ గా ఉండనుంది. ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తుండటంతో ఈ చిత్రం విజయం సాధిస్తే ప్రవీణ్ సత్తారు జాతీయస్థాయిలో మంచి గుర్తింపుపొందే అవకాశముంది.

సుధీర్ బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందనుంది.

 
Like us on Facebook