ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది నిర్మాతల మదిలో ఉన్న మాట తెలుగు టాప్ హీరోస్ తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటారా.?
ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ పలు ఫ్లాప్స్ ఎదుర్కొన్న తర్వాత హీరోలపై మరియు డైరెక్టర్స్ పై రెమ్యునరేషన్ తగ్గించమని బాగా ప్రెజర్ ఉంటుంది. దానివల్ల సినిమా భారీ ప్రొడక్షన్ కాస్ట్ అనేది బాగా తగ్గుతుంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న 4 లేదా 5 మంది టాప్ హీరోలు ప్రతి చిఎన్మాకి 10-18 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇది సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉన్న అందరికీ రిస్క్ తో కూడుకున్న వ్యవహారంగా మారుతోంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన రెమ్యునరేషన్ లో 20% తగ్గించుకొన్నారు. దానివల్ల నిర్మాతకి చాలా హెల్ప్ అవుతుంది. ఇదే విధంగా మిగతా స్టార్స్ కూడా ఇలానే రెమ్యునరేషన్ తగ్గించుకుంటే నిర్మాతలకి మరియు డిస్ట్రిబ్యూటర్స్ కి బాగా హెల్ప్ అవుతుంది.


