“నారప్ప” లో వెంకీమామ నటనకి టాలీవుడ్ ఫిదా.!

Published on Jul 20, 2021 9:10 pm IST


ఆఫ్ స్క్రీన్ లో హీరో విక్టరీ వెంకటేష్ ఎంత కలివిడిగా ఆహ్లాదంగా మాట్లాడుతారో అందరికీ తెలుసు. కానీ ఒక్కసారి కెమెరా ముందుకు వస్తే మాత్రం ఎలాంటి ఎమోషన్ అయినా కూడా వెంకీ మామ నటన ముందు దాసోహం అనాల్సిందే.. అన్ని ఎమోషన్స్ ని కూడా అందరు హీరోలు కూడా పండించగలరు కానీ తమ పెర్ఫామెన్స్ తో లైఫ్ గుర్తుండిపోయే విధంగా చేసేది కొంతమంది మాత్రమే అలాంటి వారిలో వెంకీ మామ ది ఒక సుస్థిర స్థానం అని జగమెరిగిన సత్యం.

ముఖ్యంగా తన నటనలో భావోద్వేగపూరిత నటన చేయాలి అంటే వెంకీమామ తనకి తానే సాటి. ఒక ‘రాజా’, ‘శ్రీను’, ‘చంటి’ లాంటి ఎన్నో సినిమాల్లో ఎమోషనల్ పెర్ఫామెన్స్ అంటే ఎలా ఉంటుందో వెంకీ మామ నుంచి అవి చూసి చెప్పొచ్చు. ఇక అలా ట్రెండ్ నడుస్తున్న కొద్దీ వెంకీ మామ నుంచి అలాంటి సాలిడ్ ఎమోషన్స్ చూడగలిగే సినిమాలు కూడా తగ్గుతూ వచ్చాయి.

కానీ ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ ఆడియెన్స్ అంతా కూడా వెంకీ మామ నటనకి దాసోహం అంటున్నారు. తాను నటించిన లేటెస్ట్ ఇంటెన్స్ రీమేక్ “నారప్ప” సినిమా చూసాక వెంకీమామ కోసం తెలిసిన సాధారణ యువత నుంచి సినీ ప్రముఖులు వరకు కూడా కొనియాడకుండా ఉండలేకపోతున్నారు. మరి ఆ రేంజ్ లో వెంకటేష్ ఈ చిత్రంలో ఇచ్చిన లైఫ్ టైం నటన ప్రతీ ఒక్కరినీ మైమరపించింది.

పైగా చాలా కాలం తర్వాత పర్ఫెక్ట్ యాక్షన్ మరియు ఇంతటి ఎమోషనల్ నటనను కూడా తన నుంచి చూసేసరికి వారు కూడా మరోసారి వెంకటేష్ ఎంతటి విలక్షణ నటుడో టాలీవుడ్ కి దొరికిన ఒక ఆణిముత్యం అని విపరీతమైన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ క్రెడిట్ అంతా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఒరిజినల్ చిత్రం దర్శకుడు వెట్రిమారన్ కు తన చిత్రంలో అద్భుతంగా చేసిన ధనుష్, నిర్మాతలు సురేష్ బాబు, కలైపులి థాను లకి దక్కుతుంది అని చెప్పాలి. ఇప్పటికే ఇలాంటి సినిమా ఇచ్చినందుకు వెంకటేష్ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత సమాచారం :