ట్రైలర్ టాక్ – ఎలెక్ట్రిఫయింగ్ గా అనిపిస్తున్న “మిస్ ఇండియా”.!

Published on Oct 24, 2020 11:08 am IST

ప్రస్తుతం మన దక్షిణాదిలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ లా నిలిచిన జాతీయ అవార్డు గ్రహీత మహా నటి కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో నరేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మిస్ ఇండియా” దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కు రెడీ అయ్యింది. మొదటి నుంచీ మంచి హైప్ ను నమోదు చేసుకున్న ఈ చిత్రం తాలుకా ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ ను చూస్తుంటే మాతరం కీర్తీకు ఓటిటిలో సాలిడ్ హిట్ దొరికినట్టే అని చెప్పాలి.

చిన్నప్పటి నుంచి ఉన్నతమైన కలలు కలిగిన అమ్మాయిగా కనిపించి తాను అనుకున్నది సాధించే క్రమంలో ఒడిదుడుకులను ఛాలెంజ్ లను ఎదుర్కొనే సాధారణ అమ్మాయిగా కీర్తి ఇందులో కనిపిస్తుంది. అలాగే బిజినెస్ మ్యాగ్నెట్ గా మారాలి అనుకున్న క్రమంలో కుటుంబం మరియు బిజినెస్ లో ఎదురయ్యే సవాళ్ళను చూస్తుంటే మరింత ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.

అలాగే ఆలోచింపదగ్గే డైలాగులు సీనియర్ నటుడు జగపతి బాబు కు కీర్తికి నడుమ ఎపిసోడ్స్ మరియు ఈ ట్రైలర్ కు థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఈ “మిస్ ఇండియా” పై మరిన్ని అంచనాలు నెలకొల్పేలా ఉన్నాయి. ఓవరాల్ గా మాత్రం మిస్ ఇండియా అంటే మరో అద్భుతమైన అర్ధాన్ని ఇలాంటి ఎన్నో కలలు కలిగిన ఆడవారికి మనో ధైర్యాన్ని ఈ చిత్రం ద్వారా మేకర్స్ చూపించడం ఖాయం అనేలా అనిపిస్తుంది. ఈ మహేష్ కోనేరు నిర్మాణం వహించిన ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో వచ్చే నవంబర్ 4 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More