“రాధే” ట్రైలర్ – మనకి సర్ప్రైజ్ తో కొట్టిన సల్మాన్..కానీ..!

Published on Apr 22, 2021 11:57 am IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ స్టామినా కోసం అందరికీ తెలిసిందే. సరైన హిట్ పడితే ఇండియన్ సినిమా దగ్గర లెక్కలు చాలానే మార్చేస్తాడు భాయ్.. మరి ఇదిలా ఉండగా సల్మాన్ నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ అండ్ వాంటెడ్ చిత్రం “రాధే”. దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ చిత్రం నుంచి ట్రైలర్ ను మేకర్స్ ఇప్పుడు విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ చూస్తే భాయ్ ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ లా అనిపిస్తుంది.

సల్మాన్ మార్క్ యాక్షన్, డైలాగ్స్ అలాగే కామెడీ టైమింగ్ కూడా ఇందులో కనిపించింది. అలాగే మరో ఇంట్రెస్టింగ్ అంశం మన తెలుగు ఆడియెన్స్ కి సర్ప్రైజ్ అని చెప్పాలి. సల్మాన్ మన తెలుగు సినిమాల నుంచి కూడా తన సినిమాల్లో ఏదొక అంశం పెడుతుంటారు.అలా ఇది వరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సాంగ్స్ బిట్స్ ను తన సినిమాల్లో కూడా పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి.

మరి ఈసారి కూడా బన్నీ – దేవిశ్రీ ప్రసాద్ – హరీష్ శంకర్ ల కాంబోలో వచ్చిన “డీజే” సినిమాలో సూపర్ హిట్ ట్రాక్ సీటీ మార్ సాంగ్ పెట్టడం ఊహించనిదే అని చెప్పాలి. మరి ఇది ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుందో చూడాలి.అలాగే దిశా పటాని తన రోల్ లో బాగుంది. సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ లో ఇంప్రెసివ్ గా ఉన్నాయి. అయితే ఇది బాగానే ఉన్నా ట్రైలర్ లో కనిపిస్తున్న బ్యాక్ డ్రాప్ మాత్రం చాలా రొటీన్ గా అనిపిస్తుంది.

ముంబైలో పెరుగుతున్న క్రైమ్ ని అరికట్టడానికి వచ్చే స్పెషల్ ఆఫీసర్ గా సల్మాన్ అతని విలన్ కు మధ్య జరిగే యుద్ధం కొన్ని సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లతో ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. మరి ఇది రొటీన్ గానే ఉన్నా యాక్షన్ పార్ట్ వరకు మాత్రం చాలా బాగుంది. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే మే 13 ఈద్ సంబరం వరకు ఆగాల్సిందే. అయితే ఈ చిత్రం థియేటర్స్ లో మరియు జీ ప్లెక్స్ లో పే పర్ వ్యూ గా కూడా విడుదల కానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :