మనీ హైస్ట్ ట్రైలర్ డే…ఎదురు చూస్తున్న అభిమానులు!

Published on Aug 2, 2021 12:42 pm IST


వెబ్ సిరీస్ లలో ప్రత్యేక గుర్తింపు పొందిన సిరీస్ మనీ హైస్ట్ అని చెప్పాలి. గత నాలుగు సీజన్ లు అత్యంత ఆదరణ పొందగా, అయిడవ సీజన్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఐదవ సీజన్ కి సంబంధించిన ట్రైలర్ నేడు సాయంత్రం విడుదల కానుంది. అయితే ఇందుకు సంబంధించిన సరికొత్త ఫోటో ను మనీ హైస్ట్ టీమ్ విడుదల చేయడం జరిగింది.

అయితే మనీ హైస్ట్ విదేశాల్లో మాత్రమే కాకుండా, భారత్ లో సైతం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రొఫెసర్ మైండ్ గేమ్ తో ఈ వెబ్ సిరీస్ కి ఎక్కడా లేని క్రేజ్ పెరిగింది. ఈ సీరీస్ లో ప్రతి ఒక్కరికీ కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే కాకుండా, ప్రత్యేకంగా పాత్రలను తీర్చి దిద్దడం తో ఈ సీరీస్ కోసం సర్వత్రా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మనీ హైస్ట్ సీజన్ 5 రెండు భాగాలుగా వస్తుంది. మొదటి భాగం సెప్టెంబర్ మూడవ తేదీన విడుదల కానుంది. రెండవ భాగం డిసెంబర్ మూడవ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

సంబంధిత సమాచారం :