ట్రెండింగ్ : 2023 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోరు తప్పదా …?

Published on Oct 1, 2022 3:01 am IST


ప్రతి ఏడాది ప్రప్రధమంగా వచ్చే అతి పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా పలు సినిమాలు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంటాయి. అలానే రాబోయే సంక్రాంతికి ఏకంగా మూడు బడా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వాటిలో ముందుగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ప్రభాస్ చేస్తోన్న మైథలాజికల్ డ్రామా మూవీ ఆదిపురుష్ ఇప్పటికే జనవరి 12 సంక్రాంతి బెర్త్ ని కన్ఫర్మ్ చేసుకుంది. రేపు ఈ మూవీ టీజర్ రిలీజ్ కానుండగా త్వరలో ఇతర ప్రమోషన్స్ స్టార్ట్ చేయనుంది యూనిట్.

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో రాఘవ గా ప్రభాస్, సీత గా కృతి సనన్, లంకేశ్ గా సైఫ్ ఆలీ ఖాన్ కనిపించనున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఆయన కెరీర్ 154వ సినిమా ప్రస్తుతం గ్రాండ్ లెవెల్లో రూపొందుతోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. మంచి యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి వాల్తేరు వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా ఈ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

అలానే వీటితో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇలయతలపతి విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న భారీ మూవీ వారసుడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ గ్రాండ్ యాక్షన్ కమర్షియల్ మూవీగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం వేగవంతంగా షూట్ జరుపుకుంటున్న వారసుడు కూడా సంక్రాంతికి రానున్నట్లు ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ విధంగా ఈ మూడు బడా మూవీస్ సంక్రాంతి బరిలో నిలవడం ఖాయం కావడంతో రానున్న సంక్రాంతికి బాక్సఫీస్ వద్ద త్రిముఖ పోరు తప్పేలా కనపడడం లేదు. మరి వీటిలో ఏ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరొక మూడు నెలలు ఓపిక పట్టాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :