మూడు సినిమాల్ని ముగించేసిన త్రిష !
Published on Apr 20, 2017 10:48 am IST


సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిషకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం గ్లామర్ రోల్స్ కి బ్రేక్ ఇచ్చి పూర్తిగా కథాపమైన, హీరోయిన్ సెంట్రిక్ సినిమాలనే చేస్తున్న ఆమె తాజాగా ‘మోహిని, శతురంగ వెట్టై, గర్జానై’ వంటి మూడు సినిమాల్ని ఒకేసారి పూర్తి చేసేశారు. త్రిష గత మూడు, నాలుగు నెలలుగా ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఈ సినిమాలపైనే పనిచేశారు.

వీటిలో ‘గర్జానై’ బాలీవుడ్ చిత్రం ‘ఎన్హెచ్ 10’ కు రీమేక్. ఈ థ్రిల్లర్ ను సుందర్ బాలు డైరెక్ట్ చేశారు. అలాగే నిర్మల్ కుమార్ డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘శతురంగ వెట్టై’ లో త్రిష అరవింద స్వామితో కలిసి నటించారు. ఇక మూడో సినిమా ‘మోహిని’ హర్రర్ జానర్లో రూపొందింది. ఇలా మూడు విభిన్న తరహా సినిమాల్ని ఒకేసారి కంప్లీట్ చేసిన త్రిష తమిళంలో ‘1818, 96’ మలయాళంలో ‘హే జూడ్’ వంటి మరో మూడు సినిమాల్లో నటిస్తోంది.

 
Like us on Facebook