త్రిష ‘మోహిని’ ట్రైలర్ వచ్చేస్తోంది !

సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరొయిన్ త్రిష దాదాపు అందరు టాప్ హీరోలతో నటించింది. త్రిష నటించిన ‘నాయకి’ సినిమా కొంత కాలం క్రితం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత మరే సినిమా చెయ్యలేదు ఈ హీరోయిన్. తాజాగా త్రిష నటించిన ‘మోహిని’ సినిమా ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చెయ్యనున్నారు.

ప్రిన్స్ పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘మోహిని’ సినిమాను ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నన్నారు. ఆర్‌.మాదేష్‌ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా లండన్ లో పూర్తి అయ్యింది. ఆర్‌బీ గురుదేవ్‌ కెమెరామెన్ గా పనిచేస్తున్న ఈ సినిమాకు వివేక్‌ మెర్విన్ బాణీలు అందిస్తున్నారు.