ఇద్దరమ్మాయిలతో త్రిష ‘భోగి’.. మళ్లీ మొదలైంది.

ఇద్దరమ్మాయిలతో త్రిష ‘భోగి’.. మళ్లీ మొదలైంది.

Published on Feb 2, 2015 8:43 PM IST

bhogi
తెలుగు, తమిళ భాషలలో ప్రముఖ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘భోగి’ తిరిగి ప్రారంభమయ్యింది. మరో ఇద్దరు హీరోయిన్లు పూనం బజ్వా, ఒవియా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సురేఖా వాణి కీలక పాత్రలో నటిస్తుంది. రెసీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ వార్తను త్రిష స్వయంగా సోషల్ మీడియాలో తెలిపింది. దశాబ్దన్నర కాలంగా హీరోయిన్ గా వెలుగొందుతున్న ఈ చెన్నై సుందరి, కెరీర్లో నటిస్తున్న ఫస్ట్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది.

ముగ్గురు స్నేహితురాళ్ళు ఒక ప్రయాణంలో ఎదుర్కున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాండ్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది. వరుస పరాజయాలతో త్రిషకు మార్కెట్ లేకపోవడం, ఆర్ధిక సమస్యల కారణంగా సినిమాను పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. సినిమా తిరిగి ప్రారంభం కావడంతో త్రిష చాలా సంతోషంగా ఉంది.

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో త్రిష, ఛార్మి, నికిష పటేల్ ప్రధాన పాత్రధారులుగా మొదలైన ‘రమ్’ (రంభ, ఊర్వసి, మేనక) సినిమాకు మధ్యలోనే ఆగింది. మరి, ఆ సినిమా తిరిగి ప్రారంభమవుతుందో..? లేదో..?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు