ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ భారీ చిత్రం అనంతరం తన మరో మోస్ట్ అవైటెడ్ కాంబో త్రివిక్రమ్ తో “అయినను పోయి రావలె హస్తినకు” అనే చిత్రాన్ని ప్లాన్ చేశారు.
మరి ఈ చిత్రం కూడా త్వరలోనే మొదలు నేపథ్యంలో దీనిపై పలు ఆసక్తికర విషయాలే వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని ముందు “అరవింద సమేత” లానే అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసేసి దసరా రేస్ లో నిలిపేయాలని చూస్తున్నట్టుగా టాక్ వచ్చింది.
కానీ ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో నిలపాలని చూస్తున్నట్టుగా టాక్. మరి గత ఏడాది సంక్రాంతికి వచ్చిన త్రివిక్రమ్ కనీ వినీ ఎరుగని రికార్డులను సెట్ చేసారు. మరి ఈసారి ఈ క్లాస్ అండ్ మాస్ కాంబో ఎలాంటి సెన్సేషన్ ను నమోదు చేస్తుందో చూడాలి.


