ఎన్టీఆర్ మూవీ కొరకు సీరియస్ గా పనిచేస్తున్న త్రివిక్రమ్.

Published on Feb 27, 2020 12:01 pm IST

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ ఇటీవల తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అల వైకుంఠపురంలో చిత్రంతో నాన్ బాహుబలి రికార్డు హిట్ అందుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ 30వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కొరకు స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంచిన త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనులను చక్క బెట్టే పనిలో ఉన్నారట. సినిమా క్యాస్ట్ అండ్ క్రూ సెలక్షన్ తో పాటు, షూటింగ్ లొకేషన్స్ సెలక్షన్ వంటి అన్ని పనులు పర్యవేక్షిస్తున్నారని వినికిడి.ఈ చిత్ర షూటింగ్ మే నుండి జరుపుకోనుంది.

రెగ్యులర్ షూట్ కి ఇంకా కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉన్న పక్షంలో ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తిచేసే పనిలో పడ్డారట. ఇక త్రివిక్రమ్ ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించిన నేపథ్యంలో ఎన్టీఆర్ మూవీ టైటిల్ ఇదే నంటూ ప్రచారం జరుగుతుంది. ఈ మూవీని త్రివిక్రమ్ తన గత చిత్రాల వలె ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా లేదా పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందించే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

X
More