త్రివిక్రమ్ దర్శకత్వంలో షూటింగ్ మొదలుపెట్టిన తారక్ !

తన తరవాతి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ చిత్ర షూటింగ్ మొదలుకాక ముందే త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేస్తున్నాడు. అయితే అది సినిమా కోసం కాదు.. ప్రకటనల కోసం. తారక్ ఇటీవలే స్టార్ టీవీతో ఐపీఎల్ తెలుగు వెర్షన్ ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ ప్రకటనల్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్లోనే ప్రైవేట్ గా జరుగుతోంది. ఈ యాడ్ షూట్ కి ప్రముఖ సినిమాటోగ్రఫర్ పి.సి.శ్రీరామ్ కెమెరా వరకు చేస్తున్నారు. ఇకపోతే త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ వర్కవుట్స్ చేస్తూ కొత్త లుక్ ను ట్రై చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం యొక్క షూటింగ్ మొదలుకానుంది.