మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ…హీరోయిన్ ఎవరంటే?

Published on May 7, 2023 7:30 pm IST

టాలీవుడ్ లో స్టార్ హీరో స్టేటస్ నుండి పాన్ ఇండియా స్టార్ హీరో గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ చిత్రం లో నటిస్తున్నారు. పుష్ప ది రైజ్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ పై ఓ లెవెల్ లో క్రేజ్ ఉంది. అయితే గతంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో చిత్రాల్లో నటించారు బన్నీ.

ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ మరోసారి నటించనున్నారు. ఈ చిత్రం లో విరూపాక్ష ఫేం సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ లో వైరల్ గా మారుతోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ నటిస్తే ఈసారి వేరే లెవెల్లో బన్నీ కి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :