అరవింద సమేతలో కొత్త ఎన్టీఆర్ ను చూడబోతున్నారు – త్రివిక్రమ్ !

Published on Oct 7, 2018 4:56 pm IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం విడుదలకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రేమే మిగిలివుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈచిత్రం యొక్క ప్రమోషన్స్ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు ఎన్టీఆర్ మరియు చిత్ర దర్శకుడు త్రివిక్రమ్.

దాంట్లో భాగంగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈచిత్రంలో ఎన్టీఆర్ పాత్ర ఫై త్రివిక్రమ్ స్పందిచారు. ఇంతకుముందు ఎన్నడూ చూడని ఎన్టీఆర్ ని ఈసినిమాలో చూస్తారని అన్నారు. అలాగే ఆయన పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని స్క్రీన్ మీద ఆయన ను చూసి అభిమానులు త్రిల్ అవుతారని అన్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :