ఇట్స్ అఫీషియల్.. పవన్ సినిమాకు త్రివిక్రమ్

Published on Jan 16, 2021 12:15 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా చిత్రాలకు సైన్ చేసిన విషయం తెలిసిందే. వాటిలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కూడ ఇకటి. అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ పవన్ సినిమాల జాబితాలోకి వచ్చి చేరింది. ఈ ప్రాజెక్ట్ సెట్ చేయడం వెనుక త్రివిక్రమ్ శ్రీనివాస్ హస్తం ప్రముఖంగా ఉంది. నిజానికి ‘వకీల్ సాబ్’ తర్వాత క్రిష్ సినిమా మాత్రమే చేయాలి పవన్. కానీ ఇప్పుడు ఈ రీమేక్ కూడ చేస్తున్నారు. రెండూ ఒకేసారి జరగనున్నాయి. ఈ నెల 22 నుండి రీమేక్ షూటింగ్ మొదలవుతుంది. అయితే మొదటి నుండి అనుకుంటున్నట్టు త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో మరింత సహకారం అందించనున్నారు.

కథలో మార్పులు చేర్పులు దర్శకుడు సాగర్ కె చంద్ర చేయగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించనున్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. త్రివిక్రమ్ కు, పవన్ తో, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్ధ నిర్మాతలతో మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగానే ఈ సినిమా మీద అంత దృష్టి పెడుతున్నారు ఆయన. ఇకపోతే ఇందులో మరొక ప్రధాన పాత్రను రానా చేయనున్నారు. మొత్తానికి కొన్ని వారాల వ్యవధిలోనే పవన్ భారీ సినిమాను సెట్ చేసేశారు.

సంబంధిత సమాచారం :