పవన్ పాత్ర కోసం త్రివిక్రమ్ కొత్తదనం !

Published on Nov 1, 2020 12:15 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో, త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘జల్సా, అత్తారింటికి దారేది’ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసాడు. అప్పటినుండి పవన్, త్రివిక్రమ్ మధ్య మంచి స్నేహం కుదిరింది. అయితే పవన్ మలయాళ సూపర్ హిట్ మూవీ ‘ఆయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ కె చంద్ర ఫైనల్ అయ్యారు. ప్రజెంట్ పవన్ చేయబోయే పోలీస్ పాత్రలో మార్పులు చేర్పులు చేస్తున్నారట.

అయితే ఈ మార్పుల చేర్పుల వ్యవహారంలో త్రివిక్రమ్ కే ఎక్కువ పార్ట్ ఉందట. పవన్ పాత్రను త్రివిక్రమ్ కొత్తగా డిజైన్ చేస్తున్నాడట. ఇక మరొక ముఖ్యమైన పాత్రలో టాలీవుడ్ హంక్ రానా నటించనున్నారు.సితార బ్యానర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్ణయించుకున్నారు. పవన్ చాన్నాళ్ల క్రితమే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఒక సినిమా చేయాలనే డీల్ కుదుర్చుకున్నారు. కానీ అది అప్పుడు కుదరక.. మొత్తానికి ఇప్పటికీ ఫైనల్ అయింది.

సంబంధిత సమాచారం :

More