పవన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ కు ముహూర్తం ఫిక్సైంది
Published on Oct 26, 2016 10:43 am IST

pawan-kalyan-trivikram
టాలీవుడ్ లోని హిట్ కాంబినేషన్లలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ కు భారీ క్రేజ్ ఉంది. వీరి కలయికలో సినిమా వస్తోందంటే మినిమమ్ హిట్ అని ప్రేక్షకుల నమ్మకం. గతంలో కూడా వీరిద్దరూ చేసిన ‘జల్సా, అత్తారింటికి దారేది’ చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయి. మళ్ళీ ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాని నవంబర్ 5వ తేదీన అధికారికంగా లాంచ్ చేయనున్నారు.

ఈ చిత్రానికి సంబందించిన కథను త్రివిక్రమ్ ఇప్పటికే సిద్ధం చేసేశాడని, ఆ కథ నచ్చడంతో పవన్ కూడా సినిమాని త్వరగా మొదలుపెట్టేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇకపోతే పవన్ ఇప్పటికే డాలి డైరెక్షన్లో ‘కాటమరాయుడు’ చిత్రాన్ని చేస్తున్నాడు. అలాగే మొన్న దసరా రోజున తమిళ దర్శకుడు నీసన్ డైరెక్షన్లో ఓ సినిమాను లాంచ్ చేశాడు. దీంతో పవన్ ఎప్పుడూ లేని విధంగా ఈ యేడు మూడు కొత్త సినిమాలకి సైన్ చేశాడు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook