ఎంతో ఇంట్రస్టింగ్ గా “ట్రు” తెరకెక్కించా – శ్యామ్ మండల

Published on Jul 28, 2021 10:00 am IST


గుణశేఖర్, సురేందర్ రెడ్డి, వై.వి.ఎస్. చౌదరీ వంటి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన శ్యామ్ మండల ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ గ్రీన్ లీఫ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై కే.ఆర్ నిర్మించిన చిత్రం ట్రు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం లో బైలంపుడి ఫేం హరీశ్ వినయ్, ఉందిపొరాదే ఫేం లావణ్య లు హీరో హీరోయిన్ లుగా నటించారు. అయితే ఈ చిత్రం విడుదల అయి విమర్శకుల ప్రశంసలు అందుకొని అమెజాన్ ప్రైమ్ లో టాప్ ప్లేస్ లో స్ట్రీమ్ అవుతున్న నేపథ్యం లో చిత్ర దర్శకుడు శ్యామ్ మండల కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినీ పరిశ్రమ లో స్టార్ డైరెక్టర్స్ వద్ద పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలకు సహాయ దర్శకునిగా పని చేసిన నాకు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన అవకాశం చిన్నదైనా దాన్ని సద్వినియోగం చేసుకొని ఈ చిత్రం ను తెరకెక్కించినట్లు తెలిపారు. నిర్మాత చెప్పిన బడ్జెట్ లో మంచి ఔట్ పుట్ ఇచ్చినట్లు తెలిపారు. తనకి అవకాశం కల్పించిన నిర్మాతలకు జీవితాంతం రుణపడి ఉంటాను అని అన్నారు.హీరో, హీరోయిన్ లు చాలా చక్కగా నటించారని తెలిపారు. ఈ చిత్రం తర్వాత వారికి మరిన్ని అవకాశాలు వస్తాయి అని అన్నారు. అయితే తెలుగు లో ఎవరూ టచ్ చేయని ఒక డిఫరెంట్ స్టొరీ టెల్లింగ్ తో ఒక్క క్షణం మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఆద్యంతం ఇంట్రస్టింగ్ గా తెరక్కించా అని అన్నారు.

అయితే ఈ సినిమాను చూసిన ఇండస్ట్రీ పెద్దలు డైరెక్టర్ శ్యామ్ మండల కి పెద్ద డైరెక్టర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని, ఇలాంటి క్రియేటివ్ దర్శకులని ప్రోత్సహిస్తే డెఫినెట్ గా డిఫరెంట్ చిత్రాలు వస్తాయి అనేది వాస్తవం అని వాళ్ళు అన్న మాటలు ఎప్పటికీ గుర్తు ఉంటాయి అని అన్నారు.అయితే కేవలం మౌత్ పబ్లిసిటీ తో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతూ, 11 వ ప్లేస్ నుండి టాప్ పొజిషన్ కి చేరి ట్రెండ్ అవుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం ఎం జి ప్రవీణ్ అందించారు.

సంబంధిత సమాచారం :