మరో అద్భుత ప్రేమకథతో..”టక్ జగదీష్” దర్శకుడు!

Published on Sep 25, 2021 12:00 pm IST

రీసెంట్ గా ఓటిటిలో రిలీజ్ అయ్యిన పలు చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “టక్ జగదీష్” కూడా ఒకటి. తన హిట్ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా భారీ రెస్పాన్స్ ను అందుకుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంతో దర్శకుడు శివ కాస్త కొత్తగా ట్రై చేసాడని చెప్పాలి.

తన ముందు చిత్రాలు “నిన్ను కోరి”, “మజిలీ” సినిమాలు ప్రేమకథలుగా వచ్చి పెద్ద హిట్టయ్యాయ్యి. కానీ దానికి కంప్లీట్ డిఫరెంట్ గా టక్ జగదీష్ ని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫా తీర్చిదిద్దారు శివ. మరి ఇప్పుడు మళ్ళీ ఈ దర్శకుడు ఇంకో అద్భుతమైన ప్రేమకథతో వస్తున్నట్టు కన్ఫర్మ్ చేసాడు.

తనకి ఎంతో ఇష్టమైన వైజాగ్ బీచ్ లో కూర్చిని ఈ కథ రాస్తున్నానని నిన్ను కోరి, మజిలీ ఎంత హిట్టయ్యాయో అలాంటి ప్రేమకథను మళ్ళీ తన నుంచి అందిస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా సముద్రపు కెరటాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఈ కథ అంత స్వచ్ఛమైనది గా ఉంటుంది అని శివ తెలిపారు. దీనితో తన నుంచి మరో ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ వస్తుండడం కన్ఫర్మ్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :