ప్రముఖ టీవీ నటుడు రేప్ కేసులో అరెస్ట్ !

Published on May 6, 2019 3:59 pm IST

హిందీ టీవీ నటుడు మరియు మోడల్ అయినటువంటి కరన్ ఒబెరాయ్ ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మంచి ఆమెను రేప్ చేసి.. ఆమె అభ్యంతరకరమైన ఫొటోలను, వీడియోలను తీసి.. వాటిని ఇంటర్నెట్లో పెడతానని, అందరి ముందు బహిర్గతం చేస్తానని ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడట. ఆ వేధింపులు తట్టుకోలేకపోయిన సదరు మహిళ ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా నిజంగానే కరన్ ఒబెరాయ్ ఆ మహిళ పై బెదిరింపులకు పాల్పడ్డాడని నిర్దారించినుకున్న పోలీసులు కరన్ ఒబెరాయ్ ను అరెస్ట్ చేసి… అతని పై ఐపీసీ సెక్షన్ 376, 384 ల కింద కేసు నమోదు చేశారు. కరన్ ఒబెరాయ్ పలు టీవీ సీరియల్స్ తో పాటు పలు రియాలిటీ షోల్లో కూడా నటించాడు.

సంబంధిత సమాచారం :

More