లేటెస్ట్ : SSMB28 కోసం ఒక్కరు కాదు ఇద్దరు స్టార్స్ …. ?

Published on Aug 4, 2022 3:00 am IST

సూపర్ స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్ మూవీ SSMB28 అతి త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందించనుండగా మది కెమెరా మ్యాన్ గా పని చేయనున్నారు. మొదటి నుండి అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఈ మూవీపై భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ ఒక స్టైలిష్ రోల్ లో నటించనున్న ఈ భారీ యాక్షన్ కమర్షియల్ మూవీలో కన్నడ స్టార్ ఉపేంద్ర తో పాటు కోలీవుడ్ స్టాట్ నటుడు విజయ్ సేతుపతి కూడా నటించనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. కాగా మూవీలో ఉపేంద్ర రోల్ కీలకమైనదని, అలానే విజయ్ సేతుపతి నెగటివ్ పాత్ర చేయనున్నారని తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ బయటకు రానున్నట్లు చెప్తున్నారు. కాగా ఈమూవీ షూటింగ్ ని వేగవంతంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :