తారక్ గ్రాండ్ షో ఫస్ట్ ఎపిసోడ్ కి రెండు డేట్స్ వినిపిస్తున్నాయ్.!

Published on Jul 21, 2021 9:17 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత కూడా తారక్ సాలిడ్ లైనప్ లో కూడా ఉన్నాడు. అయితే తారక్ ఒక్క సినిమాల్లోనే కాకుండా స్మాల్ స్క్రీన్స్ పై కూడా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ని అందించాడో తెలుగు ఆడియెన్స్ కి బాగా తెలుసు. అప్పుడు బిగ్ బాస్ షో ఫస్ట్ సీజన్ లో అదిరే హోస్టింగ్ తో రక్షతి కట్టించిన తారక్ మళ్ళీ ఇపుడు సరికొత్త షో “ఎవరు మీలో కోటీశ్వరులు” తో సన్నద్ధం అవుతున్నాడు.

గత కొన్నాళ్ల కితమే అధికారికంగా ప్రకటితం కాబడిన ఈ గ్రాండ్ షో షూట్ ఇపుడు భారీ సెట్ వర్క్స్ లో జరుగుతుంది. అయితే ఈ షో మొదటి ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో దానికి రెండు డేట్స్ వినిపిస్తున్నాయి. మొదటగా ఆగష్టు 13 వినిపించగా ఇప్పుడు ఆగష్టు 15 స్పెషల్ డేట్ వినిపిస్తుంది. మరి వీటిలో ఏది కన్ఫర్మో కానీ ఆ ఫస్ట్ ఎపిసోడ్ కి మాత్రం చీఫ్ గెస్ట్ గా రానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :