పవన్ కోసం ఎన్టీఆర్ టైటిల్స్?

Published on Jul 8, 2020 5:07 pm IST

మొదటిసారి పవన్ కళ్యాణ్ ఓ పీరియాడిక్ మూవీలో నటిస్తున్నారు. ఏ ఎమ్ రత్నం నిర్మాతగా దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మొఘలుల కాలం నాటి కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దొంగగా కనిపిస్తాడన్న వార్త ప్రచారంలో ఉంది. ఈ చిత్ర టైటిల్ గా విరూపాక్ష చాలా కాలంగా చెప్పుకుంటున్నారు. ఐతే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కాగా మరో రెండు టైటిల్స్ ఈ మూవీ కోసం దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్నారట.

కథ రీత్యా గజదొంగ లేదా బందిపోటు అనే టైటిల్స్ బాగా సరిపోతాయని భావిస్తున్నారట. అలాగే మాస్ అప్పీల్ కూడా ఉన్న తరుణంలో ఆ రెండింటిలో ఒక టైటిల్ నిర్ణయిస్తే బాగుంటుంది అనేది దర్శక నిర్మాతల ఆలోచన అని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇక ఆ రెండు టైటిల్స్ తో సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఉండగా, మంచి విజయం సాధించాయి. కాగా పవన్ నటించిన వకీల్ సాబ్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

సంబంధిత సమాచారం :

More