‘వెళ్లిపోమాకే’ హీరోతో ‘పెళ్ళిచూపులు’ డైరెక్టర్ !
Published on Nov 9, 2017 11:18 am IST

మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’ తో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్‌భాస్కర్. ఈ సినిమా విజయ్‌దేవరకొండ, రీతూవర్మకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా మరెన్నో సినిమా ఆఫర్స్ ను సంపాదించిపెట్టిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే అందరి మన్ననలు పొందిన డైరెక్టర్ తరుణ్‌భాస్కర్ తన నెక్ట్స్ మూవీని ఈ మద్య ప్రారంభించాడు. తరుణ్‌భాస్కర్ తన సినిమాను మరోసారి కొత్తవారితో తీసేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నాడు.

ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యింది. ఈ సినిమాలో ఇద్దరు యువహీరోలు నటించబోతున్నారు. ‘వెల్లిపోమాకే’ సినిమాలో హీరోగా నటించిన విస్వాక్ సేన్ మరియు మరో కొత్త హీరో యాక్ట్ చేస్తున్నాడు. అనీస్ సంబ్రోసే హీరోయిన్ గా నటిస్తోంది. 45 రోజుల్లోనే సినిమాను పూర్తి చెయ్యాలని డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా కు సంభందించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook