సాహో తో ‘రణరంగం’ కు సై అంటుంది ‘ఎవరు’?

Published on Jul 17, 2019 8:00 am IST

బాహుబలి లాంటి భారీ చిత్రంతో భారీ హిట్ అందుకున్న ప్రభాస్, తన తదుపరి చిత్రం కూడా సాహో లాంటి భారీ చిత్రాన్నే ఎన్నుకున్నారు. బాహుబలి చిత్రం కోసం ఐదేళ్లు కష్టపడ్డ ప్రభాస్ మరలా సాహో చిత్రానికి రెండేళ్ళుగా శ్రమిస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఆగస్టు 15న విడుదల తేదీ ప్రకటించారు. ఇంకా నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో సాహో టీమ్ నిర్విరామంగా కష్టపడుతున్నారు.

ఐతే ఎటువంటి పోటీ లేదనుకున్న సాహో చిత్రానికి పోటీగా ఇద్దరు యంగ్ హీరోలు తమ చిత్రాలను విడుదల చేయనున్నారు. వారిలో ఒకరు శర్వానంద్ కాగా మరొకరు అడివి శేషు. ఈ ఇద్దరి తాజా చిత్రాలైన రణరంగం, ఎవరు చిత్రాలు కూడా ఆగస్టు 15నే విడుదలయ్యే అవకాశాలున్నాయి.

శర్వానంద్ సరసన కాజల్, కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్లుగా నటిస్తున్న రణరంగం చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మొదట ఈ మూవీని ఆగస్టు 2న విడుదల చేయాలని భావించారు. కానీ నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ఆగస్టు 15కి పోస్ట్ ఫోన్ చేశారు. నిన్న అధికారికంగా విడుదల పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది.

ఇక మరో యంగ్ హీరో అడివి శేషు కూడా ఎవరు చిత్రాన్ని ఆగస్టు 15 నే విడుదల చేయనున్నారని సమాచారం. ముందుగా ఎవరు విడుదల తేది 23 అనుకున్న, కారణాలేమైనా ఒక వారం ముందుకు జరిపారు.

ఇలా సాహో , రణరంగం, ఎవరు చిత్రాలు ఒకే రోజు విడుదలవుతూ బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. ఐతే ఈ మూడు చిత్రాలు విభిన్న జోనర్స్ చెందినవి కావడం తో పాటు, ముగ్గురు హీరోలు విభిన్న ఇమేజ్ ఉన్నవారు కావడంతో దేనికదే ప్రత్యేకం అని చెప్పవచ్చు

సంబంధిత సమాచారం :