‘మోసగాళ్ళకు మోసగాడు’ సెన్సార్ డీటైల్స్

‘మోసగాళ్ళకు మోసగాడు’ సెన్సార్ డీటైల్స్

Published on May 18, 2015 6:39 PM IST

mosagallaki-mosagadu
కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై, ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’. ‘స్వామి రారా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత చక్రి చిగురుపాటి ‘స్వామి రారా’ సినిమాకి సీక్వెల్ గా నిర్మించిన ఈ సినిమా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్ర టీం ఈ రోజు మోసగాళ్ళకు మోసగాడు సినిమా ఫైనల్ కాపీని సెన్సార్ కి పంపారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తుచేసిన సెన్సార్ వారు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని మే 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తుంది.

స్వామి రారా సినిమాకి మోసగాళ్ళకు మోసగాడు సినిమాకి కథా పరంగా ఎలాంటి సంబందము ఉండదు. కేవలం విగ్రహాల చోరీ ఒక్క పాయింట్ మాత్రమే కామన్ గా ఉంటుందని సుధీర్ బాబు తెలియజేశాడు. సుధీర్ బాబు సరసన నందిని హీరోయిన్ గా కనిపించనుంది. ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ లో మంచు మనోజ్ గెస్ట్ రోల్ లో కూడా కనిపించనున్నాడు. నెల్లూరు బోస్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా కూడా స్వామి రారాలానే హిట్ అవుతుందని సుదీర్ బాబు, చక్రి చిగురుపాటి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

తాజా వార్తలు