క్లీన్ ‘యు’ పొందిన ‘ఉలవచారు బిర్యాని’

క్లీన్ ‘యు’ పొందిన ‘ఉలవచారు బిర్యాని’

Published on May 21, 2014 5:57 PM IST

ulava-charu-biryani
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన రెండవ సినిమా ‘ఉలవచారు బిర్యాని’. ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూడు భాషల్లోనూ ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఫుడ్ మరియు ప్రేమ అనే అంశాలు చుట్టూ తిరిగే ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సగీతం అందించాడు. ఈ సినిమాతో తేజ్, సంయుక్త హీరో హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, స్నేహలు కూడా కీలాక్ పాత్రలు పోషిస్తున్నారు.

కెఎస్ రామారావు సమర్పణలో ప్రకాష్ రాజ్ నిర్మించిన ఈ సినిమా మలయాళంలో హిట్ అయిన ‘సాల్ట్ అండ్ పెప్పర్’ సినిమాకి రీమేక్. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు