మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన హిట్ దర్శకుడు వెంకీ కుడుముల తో చేస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ కూడా ఒకటి. మరి ఈ ఇద్దరితో పాటుగా హీరోయిన్ రష్మిక మందన్నా కూడా ఈ సినిమాలో భాగం కావడంతో మళ్ళీ అంతా “భీష్మ” మ్యాజిక్ రిపీట్ అవుతుంది అని ఫిక్స్ అయ్యి ఉన్నారు.
అయితే లేటెస్ట్ గా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ క్రేజీ కాంబినేషన్ పై ఊహించని ట్విస్ట్ తెలుస్తుంది.ఈ ముగ్గురిలో అయితే ఇప్పుడు రష్మికా మందన్నా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. మరి అసలు ఈ కాంబినేషన్ వల్లనే మంచి క్రేజ్ వచ్చింది అలాంటిది అందులోనుంచి రష్మిక తప్పుకోవడం ఈ కాంబినేషన్ ఫ్యాన్స్ కి కాస్త డిజప్పాయింటింగ్ అంశమే అని చెప్పాలి.
అయితే ఇదే క్రమంలో లేటెస్ట్ గా రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ ఒకటి ఆసక్తిగా మారింది. కొన్ని కొన్ని జనరల్ విషయాల్లో నా రియాక్షన్ ఇదే అంటూ తన నవ్వు ఆపుకుంటున్న పిక్ ఒకటి పోస్ట్ చేసింది. దీనితో ఈ రూమర్స్ నిజం కాదు అని కూడా అనుకోవచ్చు. మరి ఫైనల్ క్లారిటీ ఏమన్నా వస్తుందేమో చూడాలి.


