మెగా ఫ్యామిలీ హీరోల అరుదైన రికార్డు

మెగా ఫ్యామిలీ హీరోల అరుదైన రికార్డు

Published on May 26, 2014 4:53 PM IST

pawan-charan-allu-arjun
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఓ అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన ‘రేసు గుర్రం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన 4 సినిమాలు మెగా ఫ్యామిలీకే దక్కడం విశేషం.

కలెక్షన్స్ పరంగా టాప్ 4 సినిమాల ఆర్డర్..

1. అత్తారింటికి దారేది

2. మగధీర

3. గబ్బర్ సింగ్

4. రేసు గుర్రం

ఈ రికార్డుతో మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ‘రేసు గుర్రం’ సినిమా అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా 50 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల సినిమాలు టాప్ 4 స్థానాల్లో నిలవడం చెప్పుకోదగిన విషయమైతే ఇదే రికార్డ్ ఎన్ని రోజులు కొనసాగుతుందనేది చూడాలి.

తాజా వార్తలు