‘సాహో’ మ్యూజిక్ కంపోజర్ పై దాడి

Published on Jul 31, 2019 11:55 am IST

ప్రభాస్ నటిస్తున్న “సాహో” చిత్రానికి పనిచేస్తున్న మ్యూజిక్ కంపోజర్స్ లో ఒకరైన గురు రాన్ధవా కెనడాలో దాడికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఈ సంఘటను ఆయన తెలియపరిచారు. కెనడాలో జరుగుతున్న ఓ లైవ్ మ్యూజిక్ షోకి హాజరైన సందర్భంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. పంజాబీ కుటుంబానికి చెందిన కెనడా వ్యక్తి, గురు వేదికపైకి వెళుతున్న సమయంలో అడ్డగించి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. అదృష్టవశాత్తు గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయన కుడి వైపు నుదిటిపై నాలుగు కుట్లు పడ్డాయి.

నిన్న విడుదలైన “ఏచోట నువ్వున్నా” సాహో సాంగ్ ని కంపోజ్ చేసింది గురు నే. పంజాబీ కుటుంబానికి చెందిన గురు సింగర్ గా ,కంపోజర్ గా గుర్తింపు పొందారు. నాలుగు భాషలలో విడుదలైన సాహో సాంగ్ తో గురు నేమ్ ఒక్కసారిగా సౌత్ లో ఫేమస్ అయ్యింది.

సంబంధిత సమాచారం :