సినిమా కళ తప్పిన ఉగాది

Published on Mar 25, 2020 2:00 am IST

ఈ 2020 ఉగాది సినిమా సందడి లేకుండా ముగియనుంది. ఎప్పుడు లేని విధంగా ఈ ఉగాది సినిమా కళ కోల్పోనుంది. రేపు తెలుగు వారి ప్రసిద్ద పండుగలలో ఒకటైన ఉగాది కాగా తెలుగు రాష్ట్రాలు కరోనా కర్ఫ్యూ కారణంగా నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయి. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు కరోనా వ్యాప్తిని అరికట్టే కార్యక్రమంలో భాగం స్వచ్ఛందంగా బయటికి రాకుండా ఇంటికే పరిమితం అవుతున్నారు.

ఈ నేపథ్యంలో సాధారణంగా ఉగాది రోజు ఉండే నూతన చిత్ర ప్రారంభోత్సవాలు, ఫస్ట్ లుక్స్, టైటిల్ పోస్టర్స్ వంటి అప్డేట్స్ ఏవి ఉండవు. ఇక ఇప్పటికే రెండు రాష్ట్రాలలో సినిమా థియేటర్స్ మూసి వేయడంతో పాటు, కొత్త సినిమాల విడుదల నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనితో ఎన్నడూ ఎరుగని విధంగా 2020 ఉగాది సినిమా కళ కోల్పోయింది.

సంబంధిత సమాచారం :