అన్ స్టాపబుల్: విజయ్ తో స్పెషల్ ఎపిసోడ్ నేడు విడుదల!

అన్ స్టాపబుల్: విజయ్ తో స్పెషల్ ఎపిసోడ్ నేడు విడుదల!

Published on Jan 14, 2022 4:30 PM IST


నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న కార్యక్రమం అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఈ కార్యక్రమం మొదలు నుండి ఇప్పటి వరకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమం కి వచ్చి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. తాజా గా ఇప్పుడు మరొక ఎపిసొడ్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది.

ఆహా వీడియో లో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం 9 వ ఎపిసొడ్ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ ఎపిసొడ్ లో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి రావడం జరిగింది. వీరు ప్రస్తుతం లైగర్ పాన్ ఇండియా చిత్రం కోసం కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి సంబంధించిన ఎపిసొడ్ నేడు రాత్రి 8 గంటల నుండి ఆహా వీడియో లో ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు