అన్ స్టాపబుల్ విత్ విత్ ఎన్బీకే… షో లో సందడి చేయాలా…అందరి థింకింగ్ మారిపోవాలా..!

Published on Oct 25, 2021 12:30 pm IST

బాప్ ఆఫ్ ఆల్ షోస్ అంటూ హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాత గా చేస్తున్న అన్ స్టాపబుల్ ఎన్బీకే షో నవంబర్ 4 వ తేదీ నుండి ప్రసారం కానుంది. ప్రముఖ ఓటిటి సంస్థ అయిన ఆహా వీడియో లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్య బాబు ఎలా ఉంటారు, ఎలా పర్ఫాం చేస్తారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజాగా ఆహా వీడియో సోషల్ మీడియా లో చేసిన పోస్ట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలయ్య బాబు షో లో సందడి చేయాలా, దెబ్బకి మన అందరి థింకింగ్ మారి పోవాలా అంటూ పోస్ట్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన సరికొత్త ప్రోమో విడుదల కి సిద్దం గా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో బాలయ్య ఎనర్జీ ను చూసేందుకు అభిమానులు ప్రేక్షకులు సిద్దంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :