కాలేజీలో సందడి చేస్తున్న డియర్ కామ్రేడ్ !

Published on Dec 1, 2018 4:17 pm IST


గీత గోవిందం తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ కాకినాడ లోని మెడికల్ కాలేజ్ లో జరుగుతుంది. దాంతో విజయ్ ఈ సినిమాలో మెడికల్ కాలేజీ స్టూడెంట్ గా కనిపించనున్నాడని సమాచారం. నూతన దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మండన్న క్రికెటర్ గా నటిస్తుంది.

మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానుంది. ఇక విజయ్ ఈ చిత్రం తో పాటు ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటించనున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో విజయ్ ముగ్గరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :