అత్తా,మామయ్యలపై ,ఉపాసన ఆసక్తికర ట్వీట్…!

Published on Aug 11, 2019 2:26 pm IST

మెగా కోడలు ఉపాసన ఎప్పుడూ ప్రత్యేకమే. స్టార్ హీరో భార్యలానే కాకుండా వ్యాపారవేత్తగా, మంచి వ్యాఖ్యగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అపోలో గ్రూప్స్ వంటి ప్రఖ్యాత కుటుంబం నుండి వచ్చిన ఉపాసన సోషల్ మీడియా వేదికగా అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంటూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. కాగా కొద్దీ కాలంగా ఉపాసన బి పాజిటివ్ పేరుతో ఒక మ్యాగజైన్ నడుపుతున్నారు. జీవన శైలి, యోగా,ఆరోగ్యం, ఆహారం మొదలగు విషయాలకు సంబంధించిన బి పాజిటివ్ మ్యాగజైన్ ని ఉపాసన విజయవంతంగం నడుపుతున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, హీరోయిన్ కత్రినా ఖైఫ్ లతో పాటు, భర్త చరణ్ లను ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసి వారివి కవర్ పేజీ ఫొటోలుగా సంచికలు విడుదల చేయడం జరిగింది. ఐతే తాజాగా ఉపాసన మామగారైన మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటో షూట్ నిర్వహించి ఆయన ఫోటో కవర్ పేజీ గా మ్యాగజైన్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఉపాసన మామయ్య చిరంజీవి తమ బెస్ట్ అంబాసిడర్, తన కెరీర్ అభివృద్ధి కోసం ఇంతలా సహకరిస్తున్న ఎలాంటి అత్తమామలు దొరకడం నిజంగా అదృష్టం అని,ప్రతి కుటుంబానికి మీరు స్ఫూర్తి, మీ కోడలిని అయినందుకు గర్వపడుతున్నానంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం :