ఈ వారం : అలరించే ‘ఓటీటీ’ చిత్రాలివే !

Published on Jan 10, 2022 11:39 am IST

ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. పైగా దీనికితోడు కరోనా మూడో వేవ్ దెబ్బకు భారీ సినిమాలు వాయిదా పడ్డాయి. దాంతో, ఈ వారం రాబోయే ఓటీటీ చిత్రాలు మరియు సిరీస్ ల పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం ఆహాలో ప్రసారం అవుతున్న సినిమా :

యంగ్ హీరో ప్రిన్స్‌ కీలకపాత్రలో నటించిన సినిమా ‘ది అమెరికన్‌ డ్రీమ్‌. అమెరికాలో ఓ కుర్రాడికి ఎదురయ్యే కష్టాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు. విఘ్నేశ్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించారు. నేహా కథానాయికగా నటించింది. ఈ చిత్రం జనవరి 14 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుంది.

 

ఈ వారం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు :

గెహీరాయియా (హిందీ) జనవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫ్రూత్రమ్‌ పూదు కాలాయ్‌ విదియాదా (తమిళ్‌) జనవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. అలాగే ఇదే జనవరి 14 న రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ రామ్ అసుర్ (తెలుగు) కూడా స్ట్రీమింగ్ కానుంది.
 

ఈ వారం జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా అండ్ సిరీస్ :

గరుడ గమన వృషభ వాహన (కన్నడ) జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం డిస్నీ+ హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

ఏబ్రెర్నల్స్‌ (తెలుగు డబ్బింగ్‌) జనవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హ్యూమన్‌ (హిందీ) జనవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు :

అండర్‌ కవర్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బ్రేజన్‌ (హాలీవుడ్‌) జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ల్యర్కైవ్‌ 81 (వెబ్‌ సిరీస్‌) జనవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యే కాలీ కాలీ ఆంఖే (హిందీ) జనవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం :